Monday, December 23, 2024

నగరంలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోమవారం తెల్లవారుజామున నగరంలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి.  అమీర్‌పేట్‌ పరిధిలోని మధురానగర్‌లో ఓ ఫర్నీచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్‌  దగ్ధమైంది.  అదేవిధంగా పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌లో  అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో షాప్ లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫర్నీచర్‌ దగ్ధమైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకన్న అగ్నిమాపక సిబ్బంది  మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News