ఝాన్సీ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రంలోని ఝా న్సీలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మం ది పసికందులు బుగ్గి అయ్యారు. 16 మంది విషమ ప రిస్థితిలో ఉన్నారు. తనవజాత శిశువుల వార్డులోని అత్యవసర చి కిత్స విభాగం (ఎన్‌ఐసియూ)లో శుక్రవారం రాత్రి 10.45 గం టల ప్రాంతంలో మంటలు చెలరేగాయని జిల్లా కలెక్టరు అవినాశ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఈ వార్డులో చికిత్స పొందుతున్న
దశలో ఇంకా లోకం చూడని దశలోనే మంటలకుఆహుతి కావడం అందరిని కలిచివేసింది.
ఈ ఘటనలో 16 మంది ఇప్పుడు పూర్తిగా కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్నారు. స్థానిక మహారాణి లక్ష్మిబాయి మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్కూట్ కారణం అని ప్రాధమిక దర్యాప్తుతో వెల్లడైంది. ఈ వార్డు వెలుపల ఉన్న పసికందులను వెంటనే సురక్షితంగా బయటకు తరలించారు. ఇతరులను కూడా బయటకు తీసుకువచ్చారని వెల్లడైంది. పలువురు పసికందులు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండటం, తట్టుకోలేని పసితనంతో ఉండటంతో మృత శిశువుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిసింది. అయితే పది మంది చిన్నారులు కాలి చనిపోయ్యారనే విషయం నిర్థారణ కాలేదని కలెక్టరు చెప్పారు. గాయపడ్డ పిల్లలకు చికిత్స జరుగుతోందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 30 మంది పిల్లలు ఉన్నారని స్థానిక డివిజనల్ కమిషనర్ బిమల్ కుమార్ దూబే తెలిపారు. ఆయన అర్థరాత్రి దాటిన తరువాత ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అధికారుల తలోరకం మాట
అయితే వార్డులోపల, ఆసుపత్రి సాధారణ విభాగాలలో ఎంత మంది పిల్లలు ఉన్నారనే విషయంపై అధికారులు తలోమాట చెప్పడం గందరగోళానికి దారితీసింది. తన కన్నబిడ్డ ఆసుపత్రిలో మంటలకు చనిపోయిందని మహోబా జిల్లాకు చెందిన ఓ మహిళ రోదిస్తూ చెప్పింది. రెండు రోజుల క్రితం బిడ్డ పుట్టిందని, ఇంతలోనే ఆయుష్షు తీరిపోయిందని దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లక్నోలో స్పందించారు. బాధిత శిశువులకు వెంటనే చికిత్స అందించాలని, జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు తలా రూ 5 లక్షలు, గాయపడ్డ వారికి రూ 50వేల చొప్పున అందిస్తామని వివరించారు.
కాగా ఆరోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతల్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి బృజేష్ పాఠక్ తాను ఝాన్సీకి వెళ్లుతున్నట్లు తెలిపారు. ఈ ఘటన గుండెను కలిచివేసిందని చెప్పారు. ఆయన వెంట ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బృందం కూడా వెళ్లింది.కాగా పాఠక్ ఇక్కడికి వస్తున్నారని స్థానిక అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, ఆర్భాటానికి దిగడంపై విమర్శలు తలెత్తాయి. లోపల పిల్లలు మసి అయిపోతే, పలువురు చావుబతుకుల మధ్య ఉంటే , మంత్రికి ఈ రాజరిక స్వాగతాలు ఎందుకు ? అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సదర్ ఎమ్మెల్యే రవిశర్మ ఇతర నేతలు కూడా ఆసుపత్రిని సందర్శించారు. బాధిత తల్లిదండ్రులను శనివారం ఉదయం పరామర్శించారు.
నర్సు నిర్లక్షంతోనే మంటలు?
సిలిండర్ పక్కనే అగ్గిపుల్ల వెలిగించింది
స్థానిక ఆసుపత్రిలో మంటలు చెలరేగడానికి కారణం విధుల్లో ఉన్న ఓ నర్సు నిర్లక్షమే అని భగవాన్‌దాస్ అనే వ్యక్తి చెప్పాడు, తన బిడ్డకు ఇక్కడ చికిత్సకు చేర్పించిన ఈ వ్యక్తి జరిగిన దారుణం అమానుషం అన్నారు. ఆసుపత్రిలో ఓ వార్డులో ఆక్సిజన్ సిలిండర్ పైపు కనెక్ట్ చేస్తున్న దశలోనే పక్కనే ఉన్న మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని, దీనితో మంటలు అంటుకున్నాయని తాను ఏదో విధంగా తన బిడ్డను మరో ఇద్దరు పసికందులను బట్టల్లో చుట్టుకుని బయటకు పరుగులు తీశారని తెలిపారు. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని వారంతా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. పైగా ఆసుపత్రిలో ఎటువంటి అత్యవసర పరిస్థితి నివారణ చర్యలు ఏర్పాట్లు లేవని వెల్లడైంది. మంటలు చెలరేగినా సెఫ్టీ అలారంలు మోగలేదు. ఇక పనిచేయని, కాలం చెల్లిన అగ్నిమాపక బాక్స్‌లు ఉన్నాయని నిర్థారించారు.