- Advertisement -
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నేతాజీ సుభాస్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విమానాల నిష్క్రమణ విభాగంలోని చెక్ ఇన్ కౌంటర్‌లో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. దీనితో ప్రయాణికులు భయభ్రాంతులు అయ్యారు. సమాచారం అందడంతో హుటాహుటిన అగ్నిమాపక బృందాలు తరలివచ్చాయి. మంటలను ఆర్పేందుకు సిద్ధం అయ్యారు. ప్రమాద తీవ్రతను గమనించి వెంటనే ఎయిర్‌పోర్టులోని సెక్షన్ 3లో విమానాల నిష్క్రమణను నిలిపివేశారు. ప్రయాణికులను వేరే ప్రాంతానికి తరలించారు.
- Advertisement -