Friday, November 22, 2024

బొకారో స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్‌లోని సెయిల్ బొకారో ఉక్కు ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించినట్లు, పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురైన 23 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఉక్కు ప్రాధికార సంస్థ (సెయిల్) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, హాట్ స్ట్రిప్ మిల్ రీహీటింగ్ ఫర్నేస్‌కు గ్యాస్ సరఫరా జరిగే మిక్స్‌డ్ గ్యాస్‌పైప్‌లైన్‌లో మరమ్మతు పని జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పైప్‌లైన్ మూసివేసి ఉందని, అందులో గ్యాస్ ఏదీ లేదని సెయిల్ తన ప్రకటనలో తెలియజేసింది. ‘మరమ్మతు పనిలో భాగంగా పైప్‌లైన్‌లో కాంపెన్జేటర్‌ను కూడా మార్చవలసి ఉంది.

శనివారం ఉదయం ఆ పని జరుగుతున్నప్పుడు మండే పదార్థాలైన, పైప్‌లైన్ లోపలి మిగులు నాఫ్తా, సల్ఫర్, తారు మొదలైనవాటికి నిప్పు అంటుకున్నది. ఫలితంగా దట్టంగా పొగ కమ్ముకున్నది. అది పైప్‌లైన్ ద్వారా వ్యాపించింది’ అని సెయిల్ తన ప్రకటనలో వివరించింది. మంటలను ఆర్పివేసినట్లు సంస్థ తెలిపింది. హాట్ స్ట్రిప్ మిల్ రీహీటింగ్ ఫర్నేస్ ప్రాంతంలో పని చేస్తున్న 23 మంది వ్యక్తులు పొగ పీల్చారని, వారిలో కొందరు కాంట్రాక్ట్ కార్మికులు అని సెయిల్ తెలియజేసింది. ముందు జాగ్రత్త చర్యగా వారిన బొకారో జనరల్ ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారని, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News