Monday, December 23, 2024

పాఠశాలలో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట గురుకుల పాఠశాలలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్‌పేటలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి సమయంలో చేసిన పూజలో వినాయకుడి విగ్రహం వద్ద దీపం వెలిగించారు. అయితే దీపం ఆరిపోకుండా ఉండేందుకు విద్యార్థులు చుట్టూ దుప్పట్లతో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటి వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన దీపంపై పడడంతో ఒక్కసారిగా మంటలు లేచాయి.

గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. బయటకు వెళ్తున్న క్రమంలో మంటల్లో చిక్కుకున్న నీరజ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మంటలను గుర్తించిన విద్యార్థులు గది నుంచి బయటికి పరుగులు తీయడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. లేకుంటే విద్యార్థులు తీవ్రంగా గాయపడేవారు. విషయం తెలుసుకున్న ఫిలింనగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News