Thursday, December 19, 2024

సికిందరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. లాడ్జీలో చిక్కుకున్న టూరిస్టులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్‌లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు చెలరేగడంతో పై అంతస్తులో ఉన్న లాడ్జిలో టూరిస్టులు చిక్కుకున్నారు. ఈ షోరూంలో బైకుల బ్యాటరీలు పెద్ద శబ్దాలు చేస్తూ పేలుతుండటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. షోరూం పైన ఉన్న లాడ్జి వైపు మంటలు ఎగసిసడ్డాయి. ఈ ప్రమాదంతో ఎలక్ట్రిక్ బైకులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ షోరూం పైఅంతస్తులో ఉన్న లాడ్జిలో కొంతమంది టూరిస్టులు చిక్కుకుపోయారన్న సమాచారం అందుకున్న పోలీసులు వారిని కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. కాగా లాడ్జిలో దట్టంగా పొగలు అలుముకోవడంతో లోపలి వారు చాలా ఇబ్బందులకు గురైనట్లు సమాచారం.

Fire breaks out Bike Showroom in Secunderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News