Thursday, January 23, 2025

అమరరాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిలోని చిత్తూరు జిల్లాలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యాదమరి మండలం, మోర్ధానపల్లె సమీపంలోని అమరరాజా ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని సమాచారం. సమాచారం అందుకున్న యాదమరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది అమరరాజా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల కొన్ని మీటర్లు, దాదాపు కిలోమీటర్ మేర పొగలు వ్యాపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News