Sunday, December 22, 2024

బెంగళూరు ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: బెంగళూరులోని ప్రైవేట్ బస్సులు నిలిపి ఉంచే వీరభద్రనగర్‌లోని బస్సు డిపోలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. భారీగా వ్యాపించిన మంటల్లో కొన్ని ప్రైవేట్ బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది.

కాగా..శనివారం సాయంత్రం బెంగళూరు నగరంలోని బెల్లహల్లిలోగల హజ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన రెండు రోజులకే మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంలో సమావేశ హాలులో ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రాణనష్టం సంభవించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News