Monday, December 23, 2024

హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గుజరాత్‌లోని వల్సాడ్‌లో శనివారం హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. రాత్రివేళ ఈ 22498 నెంబరు రైలు వెళ్లుతూ ఉండగా పవర్‌కారు/బ్రేక్‌ వ్యాన్‌లో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ రైలు తిరుచిరాపల్లి , గుజరాత్‌లోని శ్రీ గంగానగర్ మధ్య నడుస్తోంది. వల్సాడ్ వద్ద మంటలకు గురైంది. సమాచారం అందగానే అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరాయి. ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్లింది. మంటలు ఆర్పే యత్నాలు చేపట్టారు. రైలును ఆపివేయగానే ప్రయాణికులు సురక్షితంగా దిగి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News