- Advertisement -
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల సమీపంలో అటవీ శాఖకు చెందిన అర్బన్ పార్క్ లో గురువారం రాత్రి ఆకస్మికంగా అగ్గిరాజుకుంది ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా అటవీ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు ,పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో అనేక మొక్కలు, చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
- Advertisement -