- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.బుధవారం సాయంత్రం మల్లాపూర్ పారిశ్రామికవాడలోని రసాయనిక పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. దీంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో జనాలు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -