- Advertisement -
నిజామాబాద్: జిల్లాలోని ఆర్యనగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం టీమార్ట్ సూపర్ మార్కెట్ లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు అలుముకొని మార్కెట్ మొత్తం వ్యాపించాయి. దీంతో టీమార్ట్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అ ప్రమాదంలో సుమారుగా రూ.2 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Fire Breaks Out in Nizamabad
- Advertisement -