Saturday, April 26, 2025

శాతవాహన వర్సిటీలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్శిటీలో రెండో రోజుల నుండి మంటలు చెలరేగుతున్నాయి. తొలిరోజు మంటలు తక్కువగా ఉండడంతో ఎలాంటి నష్టం జరుగలేదు. దీంతో యూనివర్శిటీలో గల పేపర్ గోదాములో పాత పేపర్లు దగ్ధం అయ్యాయి. గురువారం మద్యాహ్నం యూనివర్శిటీ ఆవరణలోని చెట్లలో అగ్గి రాజుకోవడంతో ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆర్పివేశారు. అయితే విశాలమైన ఆవరణలో మిగిలిన నిప్పు కణికలు క్రమక్రమంగా విస్తరిస్తూ శుక్రవారం వేకువజాము వరకు యూనివర్సిటీ పేపర్ గోదాం వరకు చేరుకున్నాయి. అంతేకాకుండా విశ్వవిద్యాలయం ఆవరణలోని పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడింది. రెండో రోజున కూడా వివిధ రకాల చెట్లకు మంటలు అంటుకోవడంతో అవి కాలి బూడిదైపోతున్నాయి. మళ్లీ ఫైరింజన్లను రంగంలోకి దింపి మంటలను ఆ ర్పేందుకు అగ్రిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వేసవి కాలం కావడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి.

విద్యార్థులు ఆందోళన చెందవద్దు ః విసి ఉమేష్ కుమార్
యూనివర్సిటీలో గల పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల రికార్డులకు నష్టమేమీ జరగలేదు. ఎగ్జామ్ పేపర్స్, ఆన్సర్ షీట్స్ దగ్ధం అయినప్పటికీ వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కంప్యూటరైజ్ చేసి ఉన్నాయి. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
స్క్రాప్ పేపర్లకు అంటిన మంటలు..
పేపర్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల రికార్డులకు నష్టం ఏమీ జరగలేదు. అక్కడ నిలువ ఉన్న స్క్రాప్ పేపర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News