Friday, December 27, 2024

శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం యూనివర్సిటీ అవరణలోని చెట్ల పొదల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ నుంచి ఎంబిఎ కాలేజ్ వరకు మంటలు విస్తరించాయి. యూనివర్సిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.

Fire Breaks out in Satavahana University

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News