- Advertisement -
పెద్దపల్లి : జిల్లాలోని పెద్దపల్లి మండలం ఆపన్నపేటలోని ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో గోదాంలో ఉన్న టపాసులు పేలడంతో మంటలు తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది మూడు వాహనాలతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం కలిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -