Monday, January 20, 2025

మధ్యప్రదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి న్యూఢిల్లీ వెళుతున్న వందే భారత్ ఎక్సెప్రెస్‌కు చెందిన ఒక బోగీకి సంబంధించిన బ్యాటరీ బాక్సుకు సోమవారం ఉదయం నిప్పంటుకుంది. ఆ బోగీలో ప్రయాణిస్తున్న 20-22 మంది ప్రయాణికులను వెంటనే ఇతర బోగీలలోకి మార్చినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆయన చెప్పారు.

భోపాల్‌లో తెల్లవారుజామున 5.40 గంటలకు రాణి కమలాపతి-హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరినట్లు వెస్ట్ సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు. రైలు కల్హర్ స్టేషన్‌ను దాటుతుండగా సి 14 బోగీకి చెందిన బ్యాటరీ బాక్సు నుంచి పొగలు రావడాన్ని ఆ స్టేషన్ మేనేజర్ చూసి వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.

రైలును కుర్వాయ్-కైతోరా స్టేషన మధ్య నిలిపివేసినట్లు ఒక అధికారిక ప్రకటనలో ఆయన తెలిపారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉదయం 7.58 గంటలకల్లా మంటలను ఆర్పివేశారని ఆయన చెప్పారు. బోగీ అడుగుభాగంలో ప్రయాణికులకు దూరంగా బ్యాటరీ బాక్సు ఉంటుందని ఆయన వివరించారు. ఆ తర్వాత బ్యాటరీలనువిద్యుత్ సిబ్బంది బోగీ నుంచి విడదీసి, బోగీకి మరమ్మతులు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News