Sunday, December 22, 2024

ఫరీదాబాద్ థర్మాకోల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

ఫరీదాబాద్ : ఫరీదాబాద్ సెక్టార్ 24 ప్రాంతంలోని బహుళ అంతస్తుల థర్మాకోల్ ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక మహిళతో సహా ముగ్గురు గాయాలపాలయ్యారు. నరేంద్ర పాలిమర్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఉన్న ఈ థర్మాకోల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై ఆదివారం 2.40 గంటల ప్రాంతంలో పోలీస్‌లకు సమాచారం అందింది. నాలుగు అగ్ని మాపక వాహనాలు వెంటనే వెళ్లి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. అయినా మంటలు తగ్గక పోవడంతో మరో 18 ఫైరింజన్లు తరలివెళ్లాయి. సమీప కంపెనీలకు చెందిన మరికొన్ని ఫైరింజన్లు కూడా వెళ్లాయి.

సాయంత్రం వరకూ మంటలు ఆరలేదు. సమాచారం తెలియగానే పాత ఫరీదా బాద్ ఎమ్‌ఎల్‌ఎ నరేందర్ గుప్తా ప్రమాదస్థలానికి పోలీస్ బృందంతో వెళ్లారు. ఫ్యాక్టరీ పక్కనున్న భవనంలో నిల్వ చేసిన రసాయనాల నుంచి మంటలు లేచి, కొన్ని నిమిషాల్లోనే వ్యాపించి పేలుళ్లు జరిగాయని అధికారులు చెప్పారు. మహిళా ఉద్యోగి జ్ఞానవతి, సందీప్ మౌర్య, మరో కార్మికుడు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ఇఎస్‌ఐ, బికె ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం శెలవు దినం కావడంతో ఎక్కువ మంది కార్మికులు ఫ్యాక్టరీలో లేరు. ఫైరింజన్ల రాకపోకల కోసం ట్రాఫిక్‌ను మళ్లించారు. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న అజాద్‌నగర్ మురికివాడ ప్రజలను వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News