- Advertisement -
తిరుమల: తిరుమలకు మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని తిరుమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించిన టిటిడి అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎఫ్‌ఓ, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వాటర్ ట్యాంక్‌లతో ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదంలో శ్రీ గంధం చెట్లతో సహా అనేక వృక్షాలు దగ్ధమయ్యాయి. దీనికి కారణం ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
- Advertisement -