Monday, December 23, 2024

ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బెంగళూరులోని సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో(కెఎస్ఆర్) పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్టేషన్ లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని బీ1, బీ2 బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి. అప్పటికే ప్రయాణికులంతా రైలు నుంచి దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు, మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఎస్-2 బోగీలో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రైలులో మంటలు చెలరేగడంపై ప్రయాణికులు ఆందోలన వ్యక్త చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News