Saturday, January 25, 2025

యుపిలో అగ్నిప్రమాదం: ఐదుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

యుపి: ఉత్తరప్రదేశ్‌లోని మౌలోని షాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

జిల్లా మేజిస్ట్రేట్, మౌ, అరుణ్ కుమార్ మాట్లాడుతూ… మౌ జిల్లాలోని షాపూర్ గ్రామం, కోపగంజ్ పిఎస్ పరిధిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ, పురిషుడితో పాటు ముగ్గురు మైనర్‌లు ఉన్నట్లు తెలిపారు. అగ్నిమాపక దళం, వైద్య సిబ్బందితో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు. స్టవ్ నుండి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నివేదిక తెలిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News