- Advertisement -
రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతలకు మనుషులు ఇబ్బందులు పడుతుంటే వాహనాలు కూడా అదే తరహలో కాలిబూడిద అవుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నడుస్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ పై ఉన్న వ్యక్తి అప్రమత్తమై పక్కకు ఆపడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. గచ్చిబౌలి పోలిస్‌స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ నుండి ట్రిబుల్ ఐటీ మార్గంలో బైక్ పై సాప్ట్‌వేర్ ఇంజనీర్ వెలుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ పక్కకు ఆపి వెంటనే వాహనదారుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేసేలోపు బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
- Advertisement -