Sunday, December 22, 2024

నోయిడాలో అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్: నోయిడాలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నోయిదాలోని సెక్టర్ 65లోని ఓ బిల్డింగ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా చీఫ్ ఫైర్ ఆఫీసర్(CFO) ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. “ఉదయం 4.30 గంటలకు ఒక లెదర్ తయారీ కంపెనీలో మంటలు సంభవించినట్లు మాకు సమాచారం అందింది. 15 ఫైర్ టెండర్లను ఘటనా స్థలానికి పంపించి మంటలు ఆర్పివేశాం. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు” అని చెప్పారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News