Wednesday, January 22, 2025

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టెల్లా కాలేజీ సమీపంలోని టివిఎస్ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఐదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.

ముందస్తుగా పరిసర ప్రాంతాల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో సుమారు 200 ద్విచక్ర వాహనాలు దగ్ధం కావడంతో రూ.కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News