- Advertisement -
మేడ్చల్ మల్కాజ్ గిరి: గ్యాస్ పైప్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రామ్ రెడ్డి నగర్ లో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బాగ్య నగర్ గ్యాస్ ఏజెన్సీ కి చెందిన పైప్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల కంపెనీలలో పని చేసే కార్మికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. భాగ్య నగర్ గ్యాస్ సిబ్బంది గ్యాస్ సప్లై వాల్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది అని స్థానికులు. ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -