Sunday, January 19, 2025

నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః గ్రేటర్‌లో వరుస అగ్ని ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం నగరంలో రెండు ఆగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హబ్సిగూడలోని ఓ రెస్టారెంట్, బట్టల షాపుల భవనంలో భారీ ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా అత్తాపూర్ హసన్ నగర్‌లోని వస్త్రాల గోదాంలో సైతం ఆగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో హబ్సిగూడలో రెండు మూడు అంతస్తులో ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఘటన చోటు చేసుకోవడంతో ఆస్తినష్టం తప్ప ఏలాంటి ప్రాణ నష్టం లేకపోవడం అంతా ఊపిరి పీచ్చులుకున్నారు. ఆగ్ని ప్రమాదానికి సంబంధించి స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులతో పాటు ఆగ్నిమాపక సిబ్బంది, డిఆర్‌ఎఫ్ బృందాలు హూటహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. 10 ఫైర్ ఇంజన్లతో సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే మంటలు అదుపులోకి వచ్చినప్పటీకు దట్టమైన పోగలు కొనసాగడంతో మధ్యాహ్నాం 4 గంటల వరకు ఆగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సంఘటన చోటు చేసుకున్న భవనం పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ముందుస్తూ జాగ్రత్తలను తీసుకున్న పోలీసులు బంక్‌ను మూసివేయించారు. డిఆర్‌ఎఫ్ డైరెక్టర్ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని సమాయక చర్యలను పర్యవేక్షించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ షాట్ సర్కూటా, లేక ఇతర కారణాలా అన్నఅంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అత్తాపూర్‌లోని హసన్ నగర్‌లో సైతం బట్టల గోదాంలో ఆగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతోపాటు దట్టమైన పోగ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News