Monday, December 23, 2024

అబుదాబి నుంచి భారత్‌కు వస్తున్న విమానంలో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

అబుదాబి: విమానం అబుదాబి నుంచి కాలికట్‌కు వెళ్తుండగా మంటలు చెలరేగడంతో మళ్లీ అదే విమానాశ్రయంలో ల్యాండైన సంఘటన అబుదాబిలో జరిగింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం 184 మంది ప్రయాణికులతో అబుదాబిలో టేకాఫ్ తీసుకుంది. వెయ్యి అడుగుల పైకి వెళ్లిన తరువాత ఒక ఇంజన్‌లో మంటలు రావడంతో అబుదాబి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అధికారులు ల్యాండ్ చేయడానికి ఓకే చెప్పడంతో విమానాన్ని ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపంతో విమానంలో మంటలు చెలరేగాయని విమానయాన అధికారులు వెల్లడించారు. అబుదాబి నుంచి భారత్‌లోని కాలికట్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News