Saturday, November 16, 2024

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Fire broke out in corona hospital in Mumbai

 

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయిలో కరోనా రోగులకు చికిత్స చేసే ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనంకాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భాండప్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 76 మంది కరోనా రోగులు చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో చోటుచేసుకోవడంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమై రోగులను బయటకు పంపించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది 23 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయని డిసిపి ప్రశాంత్ కదమ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News