Monday, December 23, 2024

ఇండిగో విమానంలో మంటలు… తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇండిగో విమానం టేక్ ఆఫ్ అవుతుండగా మంటల చెలరేగాయి.  మంటలను గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకులను, సిబ్బందిని విమానం నుంచి కిందకు దించారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని విమానయాన అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ-2131 విమానం 177 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో పైలట్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఆకాశంలో ఉన్నప్పుడు మంటలు చెలరేగి ఉంటే ఊహించుకోవడానికే కష్టంగా ఉందని ప్రయాణికులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News