Tuesday, December 3, 2024

కాగజ్‌నగర్ జిన్నింగ్ మిల్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

రెబ్బన ః రెబ్బన మండలంలోని కాగజ్‌నగర్ క్రాస్ రోడ్డులో గల కాగజ్‌నగర్ జిన్నింగ్ మిల్‌లో శుక్రవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 90 పత్తి బేల్లు, 1600 క్వింటాళ్ల పత్తి దగ్నం అయినట్లుగా అంచనాలు వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ట్రాక్టర్ డొజర్‌తో పత్తిని కుప్ప చేస్తున్న క్రమంలో బ్యాటరీ షాట్  సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా మంటలు ఎగిసిపడడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే మిల్లు యాజమాన్యానికి సమాచారం చేరవేసాడు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్‌లతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దగ్ధం అయిన పత్తి విలువ సుమారు 60 నుంచి 70లక్షలు మేర నష్టం కల్గిఉండవచ్చని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News