Monday, December 23, 2024

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో చెలరేగిన మంటలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. శనివారం సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లిన దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. భువనగిరి దాటిన తర్వాత అర్థరాత్రి రైలులో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. రైలు చివరి బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయంతో రైలు నుంచి బయటకు బరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.

Fire broke out in luggage Bogie of Dakshin Express

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News