- Advertisement -
హైదరాబాద్ : అహ్మదాబాద్ నుంచి చెన్నై వెల్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జంక్షన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఊహించని ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైళ్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది.
నవజీవన్ ఎక్స్ ప్రెస్ లోని పాంట్రీ బోగీలో మంటలు చెలరేగాయి. ఇది గుర్తించిన సిబ్బంది గూడూరు రైళ్వే స్టేషన్ లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనతో రైలు గూడూరు స్టేషన్ లో గంట సేపు నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -