Tuesday, January 21, 2025

న్యూయార్క్‌లో అగ్ని ప్రమాదం: భారతీయ జర్నలిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్ కు చెందిన జర్నలిస్టు మృతి చెందాడు. భారత్‌కు చెందిన ఫజిల్ ఖాన్ అనే యువకుడు (27) కొలంబియా జర్నలిజం స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. హర్లెమ్ లో ఓ ఆపార్ట్ మెంట్ లో ఫజిల్ ఖాన్ ప్లాట్‌కు సమీపంలో మంటల చెలరేగడంతో అతడు సజీవదహనమయ్యాడు. మంటలు పైఅంతస్థుల్లో ప్రారంభమయ్యాయని, కొందరు పైనుంచి కిందకు దూకారని స్థానికుడు అఖిల్ జోన్స్ తెలిపాడు. ఫజల్ ఖాన్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అతడి తల్లిదండ్రులతో భారత్ ఎంబసీ అధికారులు మాట్లాడడంతో పాటు భారత్‌కు ఫజల్ మృతదేహాన్ని పంపిస్తామని వెల్లడించారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఆదేశాలు జారీ చేసింది. భారత్ లో ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్ గా పని చేశాడు. జర్నలిజం పూర్తి చేసేందుకు 2020లో న్యూయార్క్ కు వెళ్లాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News