- Advertisement -
హైదరాబాద్: రాయదుర్గంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐమాక్ ఛాంబర్ 2, 3వ అంతస్థులో మంటలు చెలరేగాయి. రెండు, మూడో అంతస్థుల నుంచి దట్టమైన పొగ వెలువడింది. నాలుగోవ అంతస్తులో సెక్యూరిటీ సంస్థల కార్యాలయం ఉంది. మొదట యాక్షన్ గార్డింగ్ ఐటి కంపెనీలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగినప్పుడు కార్యాలయంలో 18 మంది సిబ్బంది ఉన్నారు. రెస్కూ ఆపరేషన్ చేసి క్రేన్‌తో సిబ్బందిని కిందకు దింపుతున్నారు. ఇప్పటి వరకు 13 మందిని రక్షించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మూడు ఫైరింజన్లతో పాటు భారీ క్రేను కూడా ఉంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మొదటి అంతస్థులో గ్రీన్ బావర్చి, రెండు, మూడో అంతస్థులో ఐటి కంపెనీ ఉంది.
- Advertisement -