Monday, January 20, 2025

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం కోటలోని ఓ స్క్రాప్ గోడౌన్‌లో తెల్లవారుజామున మంటలు అలుముకున్నాయి. క్రమంగా భారీగా మంటలు చెలరేగుతూ గోడౌన్ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కొంతసేపు తీవ్రంగా శ్రమించి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News