- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సి-4 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఉత్తరాఖండ్ లోని కాన్స్రో సమీపంలో చోటుచేసుకుంది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఉత్తరాఖండ్ డిజిపి అశోక్ కుమార్ వెల్లడించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అందుపుచేశారు. దీంతో తృటిలో పెనుప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
fire broke out in shatabdi express in uttarakhand
- Advertisement -