Sunday, January 19, 2025

పర్యాటక శాఖ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అటవీశాఖ కీలక ఫైళ్లు మంటల్లో తగులబడ్డాయి. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటకు రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు అంటుకున్నాయని అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ సమయంలో మంత్రితో ఎండి తిరుమలకు వెళ్లనందుకు అతడిపై వేటు పడింది. ఇటీవలే పర్యాటక శాఖ ఎండి మనోహర్‌ను ఇసి సస్పెండ్ చేసింది. పర్యాటక శాఖలో అగ్ని ప్రమాదంపై సిపిఐ నారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుండడంతో అగ్ని ప్రమాదం కుట్ర జరిగిందని, కీలక ఫైల్స్ కాలటంపై అనుమానులు ఉన్నాయని నారాయణ మండిపడ్డారు. హైలెవల్ ఎంక్వైరీ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News