Monday, December 23, 2024

ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం.. అర్చకులతో సహా 13మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అర్చకులతో సహా 13మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సోమవారం హోలీ పర్వదినం సందర్భంగా గర్భగృహంలో భస్మ హారతి కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

మంటలు ఎగిసి పడి అక్కడున్న సామాగ్రి, వస్త్రం లాంటివి అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. అయితే.. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News