Friday, April 25, 2025

విఎస్‌టిలో భారీ అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరధిలోని విఎస్‌టిలో గురువారం ఉదయం ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అగ్ని కీలలు ఎగిసిపడుతున్నప్పుడు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన స్థలానికి అగ్నిమాపక కేంద్రం రెండు కిలో మీటర్ల దూరంలోనే ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News