Saturday, December 21, 2024

పుణె రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Pune Restaurant

పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్‌లోని మార్వెల్ విస్టా భవంతి పైఅంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భవంతి గ్రౌండ్ ఫ్లోర్‌లో క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్  ఉంది. ఉదయం 8.45 గంటల ప్రాతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఆరు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని 10 గంటల ప్రాంతంలో మంటలను అదుపు చేశాయి. రూఫ్‌టాప్ ఏరియా బాగా దెబ్బతినడంతో పాటు కిందనున్న కార్యాలయాలు, భవంతులు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు కానీ, ఏ మేరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందనేది ఇప్పటికైతే తెలియలేదు. ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించారా అనేది కూడా అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News