Tuesday, December 24, 2024

క్షిపణి దాడి లో 25 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్ శివారు మార్కెట్‌పై ఆదివారం ఉదయం జరిగిన క్షిపణి దాడిలో 25 మంది మృతి చెందారని స్థానిక అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో టెక్‌స్టిల్ష్‌చిక్ సబర్బన్ ప్రాంతంలో 20 మంది గాయపడ్డారని రష్యా నియమిత సిటీ మేయర్ అలెక్సీకులెమ్‌జిన్ వివరించారు. ఉక్రెయిన్ మిలిటరీ దళాలే ఈ దాడికి పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ దాడిపై కీవ్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. సంఘటన ప్రదేశంలో అత్యవసర సర్వీస్‌లు తమ సహాయ కార్యక్రమాలు చేపట్టినట్టు డొనెట్స్ లో రష్యా నియమిత అధికార వర్గాల అధినేత డెనిస్ పుషిలిన్ చెప్పారు. రష్యాకు చెందిన యుస్ట్‌లుగా పోర్ట్ రసాయనాల రవాణా టెర్మినల్ గ్యాస్‌ట్యాంకు వద్ద ఆదివారం రెండు పేలుళ్లు జరిగి అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాంతీయ అధికార వర్గాలు వెల్లడించాయి.

పోర్టుపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయని స్థానిక మీడియా కథనం వెల్లడించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వాయువ్యంగా 165 కిమీ దూరంలో నోవ్‌టెక్ వద్ద రష్యాలో రెండో భారీ సహజవాయువు ఉత్పత్తి కేంద్రంపై ఈ దాడి జరిగింది. . బయటిదేశాల జోక్యం వల్లనే ఈ దాడి జరిగిందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ ప్రమాదంతో రష్యా పోర్టులో కార్యకలాపాలు మందగించాయి. రష్యాకు చెందిన కింగిసెప్ జిల్లాలో ఈ పోర్టు ఉంది. ఎలాంటి ప్రాణహాని జరగలేదని, ఆ ప్రాంతమంతా అప్రమత్తం చేశామని జిల్లా అధినేత యూరీ జపలట్‌స్కీ చెప్పారు. రోజువారీ సమీక్షలో కింగ్‌సెప్ ఏరియాలో డ్రోన్ల దాడి గురించి రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఎలాంటి ప్రస్తావన చేయలేదు. రష్యా స్మోలెన్‌స్కీ రీజియన్‌లో నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చి వేసినట్టు తెలిపారు. ఒరియోల్, తుల రీజియన్లలో మరో రెండు డ్రోన్లను కూల్చివేయడమైందని పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ శివారు ప్రాంతాల్లో గురువారం ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇంతకు ముందు రష్యా అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News