Monday, January 20, 2025

నడుస్తున్న కారులో మంటలు

- Advertisement -
- Advertisement -

డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ముప్పు

హైదరాబాద్ : నగరంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్ రోడ్డు వద్ద మధ్యా హ్నం నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడు కున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును రోడ్డ పక్కన నిలిపివేశాడు.

దీంతో కారులో ఉన్న వారంతా వెంటనే దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో సమీపంలోని హెచ్‌పి పెట్రోల్ పంపును మూసి వేశారు. ప్రమాద ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా, కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News