- Advertisement -
అమరావతి: ప్రయాణికులతో వెళ్తున్న బస్సుకు ఓ యువకుడు నిప్పంటించిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం ఉదయం జరిగింది. మొగులూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు కనిగిరికి వచ్చాడు. ఆర్టిసి బస్టాండులో ఉన్న బస్సుపై యువకుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేశారు. బస్సుకు ఎటువంటి నష్టం జరగలేదు. స్థానికులు స్పందించకపోతే పెను ప్రమాదం జరిగేదని ప్రయాణీకులు వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఏడుకొండలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. యువకుడికి మానసిక పరిస్థితి బాగోలేదని మొగులూరు గ్రామస్థులు తెలిపారు.
- Advertisement -