Saturday, April 5, 2025

ఢిల్లీలో కోచింగ్ సెంటర్‌లో మంటలు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ముఖర్జీ నగర్‌లోగల ఒక భవనంలో గురువారం మంటలు వ్యాపించాయి. కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలో మంటలు వ్యాపించడంతో మంటలను తప్పించుకునే ప్రయత్నంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.

భవనంలోని మూడవ అంతస్తు నుంచి కొందరు వ్యక్తులు తాళ్ల సాయంతో కిందకు దిగి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంటలు ఆర్పేందుకు 11 అగ్నిమాపక శకటాలు భవనం వద్దకు చేరుకున్నాయి. కొద్ది గంటల్లోనే మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News