Thursday, January 23, 2025

ఇంటికి నిప్పంటించిన కొడుకు

- Advertisement -
- Advertisement -

బీర్కూర్: రాను రాను మానవత్వం మంట గలిసిపోతుందని బీర్కూర్ వాసులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు గవ్వల అశోక్. భార్య ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటూ ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో తల్లి గవ్వల చంద్రవ్వ ఒంటరిగానే ఇంటి వద్ద ఉంటూ మిగిలిన మూడు గదులను ఇతరులకు అద్దెకు ఇచ్చి కాలం వెళ్లదీస్తుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో నుంచి మంటలు, పొగ రావడం కాలనీవాసులు చూడగా, చంద్రవ్వ బయట నుంచి రావడం చూసిన ఆమె కుమారుడు అశోక్ అక్కడి నుంచి పారిపోవడం కాలనీవాసులు గమనించారు.

Also Read:  బోల్డ్ క్యారెక్టర్ లో అనసూయ భరద్వాజ్..

ఇదే విషయమై చంద్రవ్వ ప్రశ్నించగా, తాను మాట్లాడుతూ తన కుమారుడికి తనకు చాలా రోజుల నుంచి మాటలు లేవని, అయినా హైదరాబాద్‌ను వచ్చినప్పుడల్లా తనను విపరీతంగా కొట్టడం, హింసించడం చేస్తాడని, గత మూడు నెలల క్రితం కూడా ఇంటికి వచ్చినప్పుడు తనపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడని తెలిపింది. శనివారం వచ్చి రెండు రోజులు బాగానే ఉన్నాడని, అయినా తాను తన కుమారుడు మాట్లాడుకోలేదని తెలిపింది. సోమవారం తాను స్నానం చేసి బట్టలు ఉతికి ఆరబెట్టి కాలనీలోనే తెలిసిన వాళ్లింటికి వెళ్లానని తెలిపింది. తాను ఇంట్లోనే ఉన్నాననుకుని, తన గదికి గడియ పెట్టి, తన కొడుకు ఇంటికి నిప్పు పెట్టాడని ఆమె తెలిపింది. ఈ విషయమై బీర్కూర్ ఎస్సై బాల్‌రెడ్డి వివరణ కోరగా, ఇంటికి నిప్పు పెట్టిన గవ్వల అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలో అతనిని పట్టుకుంటామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News