Monday, January 20, 2025

ముంబై ఆసుపత్రి సమీపంలోని పిజ్జా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -
ఒకరు మృతి, 11 మందికి గాయాలు

ముంబై: ఘట్‌కోపర్ ప్రాంతంలోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న పిజ్జా రెస్టారెంట్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. అదే కట్టడంలో ఉన్న పరాఖ్ ఆసుపత్రిని మంటలు చుట్టుముట్టడంతో అందులోని వారిని ఖాళీ చేయించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని బిఎంసి అదనపు కమిషనర్ సంజీవ్ కుమార్ తెలిపారు. 22 మంది రోగులను సురక్షితంగా మరో వైద్యశాలకు తరలించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎనిమిది అగ్నిమాపక శకటాలను ఘటనాస్థలికి పంపినట్లు ముంబై అగ్ని మాపక అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయని, ప్రస్తుతానికి మంటలు ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు.
తన ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి రోగులను పంపినట్లు పరాఖ్ ఆసుపత్రి ఓనర్ డాక్టర్ నరేంద్ర దేధియ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News