Thursday, January 23, 2025

బొడ్రాయి ప్రతిష్టాపన లో అపశృతి..

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆదివారం ఆపశృతి చోటు చేసుకుంది. బొడ్రాయి ప్రతిష్టాపన కోసం వేసిన యాగశాల ప్రమాదవశాత్తు అగ్రిప్రమాదానికి అహూతైంది. ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో పక్కనే బొడ్రాయి ప్రతిష్టాపన జరుగుతుండడంతో అక్కడికి పెద్దెత్తున గ్రామ ప్రజలు చేరుకున్నారు.ఈ ఘటనతో భయాందోళనలతో గ్రామస్థులు పరుగులు పెట్టారు. కొద్ది నిమిషాల పాటు అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు ఆందోళన, పరుగులు పెట్టడంతో గ్రామానికి చేరుకున్నవారు కూడా ఎటు పాలుపోని పరిస్థితిని ఎదుర్కోన్నారు. అక్కడున్న వారు కొందరు దైర్యం చేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ గడ్డితో ఏర్పాటు చేసిన యాగశాల పూర్తిగా మంటలకు ఆహూతి అయ్యింది.

పూర్తిగా మంటలు ఆరిపోయాక గ్రామస్తులు బొడ్రాయి ప్రతిష్ట జరిగిన ప్రదేశానికి చేరుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేపట్టారు. కాగా గ్రామానికి వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డ వారంతా స్వగ్రామానికి చేరుకుని గ్రామ దేవత బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలకు హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇంటింటా ఆడబిడ్డలు, బంధువులు చేరుకోవడంతో గ్రామ సందడిగా మారింది. ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లతో పాటు కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ ఉపాద్యక్షులు తేజావత్ బెల్లయ్య నాయక్‌లు తమ అనుచరులతో కలసి బొడ్రాయి తల్లీని దర్శనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News