ఇటావా: ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాలో బుధవారం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళుతున్నప్పుడు, స్లీపర్ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించారు. దీంతో స్టేషన్ మాస్టర్ పొగలు రావడంతో రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించి రైలును నిలిపివేశారు.
అనంతరం స్లీపర్ కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు తీశారు. మంటలు అంటుకున్న వెంటనే పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. రైలులో దాని సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదానికి కారణమేమిటో ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.