Monday, December 23, 2024

యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అగ్ని భద్రతా శిక్షణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : యశోద ఫౌండేషన్ నగరంలోని వివిధ ప్రదేశాలలో 2 వేల మందికి సమగ్ర అగ్ని భద్రతా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అగ్నిమాపక భద్రతా పద్ధతుల గురించి ప్రజల కు అవగాహన కల్పించడం, అగ్ని సంబంధిత అత్యవసర పరిస్థితులను నివారించడానికి, నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించడం ఈకార్యక్రమం లక్ష్యం. ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని యశోద హాస్పిటల్స్‌లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల విద్యార్థుల కోసం ఖా నామెట్‌లోని శ్రీసరస్వతి పాఠశాల, మలక్‌పేట్‌లోని ప్రభుత్వ సిటీమోడల్ హైస్కూల్, మక్తాలోని రెసిడెన్షియల్ కాలనీ, రసూల్‌పురా మురికివాడలకు కూడా శిక్షణను విస్తరించారు.అగ్నిమాపక, తరలింపు విధానాలతో సహా అగ్ని భద్రత అంశాలను శిక్షణలో కవ ర్ చేశారు. వివిధ రకాల మంటలు, మంటలను ఆ ర్పే యంత్రాల రకాలు వాటిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో శిక్షణ పొందిన వారు తెలుసుకున్నారు.

అగ్ని ప్రమాద సమయంలో భవనాన్ని సురక్షితంగా ఎలా ఖాళీ చేయవచ్చో వారికి శిక్షణఇచ్చారు. ఈ సందర్భంగా యశోద ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గోరుకంటి మాట్లాడుతూ, యశోద ఫౌండేషన్ అత్యంత అర్హులైన నిరుపేద యువతకు నైపుణ్యాలు కల్పించడానికి కట్టుబడి ఉన్న లాభాపేక్ష లేని సంస్థ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.ఫైర్ సేఫ్టీ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, అగ్ని మాపక నివారణ, నిర్వహణలో నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం తమ ఉద్దేశమని పేర్కొన్నారు. నగరంలో ప్రజారోగ్యం, భద్రతను మెరుగుపరచడానికి యశోద ఫౌండేషన్ కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News