Friday, December 20, 2024

చారిత్రక ఏథెన్స్‌ నగరానికి కార్చిచ్చు ముప్పు

- Advertisement -
- Advertisement -

రోమ్: గ్రీస్‌లో కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఆదివారం నాటికి చారిత్రక ఏథెన్స్ నగరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొన్ని చోట్ల అగ్ని కీలలు 85 అడుగుల ఎత్తు ఉన్నట్టు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. కార్చిచ్చు కారణంగా గ్రీస్ లోని సగం ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 500 మంది అగ్ని మాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా మంటలు అదుపు లోకి రావడం లేదు. మొత్తం 152 ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు.

29 వాటర్ డ్రాపింగ్ విమానాలు రంగంలోకి దిగాయి. స్థానికంగా మారథాన్ సహా ఇతర ప్రాంతాల వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైనిక ఆసుపత్రిని ఖాళీ చేయించారు. అగ్ని కీలల కారణంగా ఇద్దరు సిబ్బంది గాయపడినట్టు, మీడియా కథనాలు వెల్లడించాయి. పొగ వల్ల చాలా మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. 2018లో కార్చిచ్చు సముద్ర తీరం లోని సుందరమైన మాటి నగరాన్ని పూర్తిగా బూడిద చేసింది. ఆనాడు వందమంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది కార్చిచ్చు మంటలకు 20 మంది మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News