Thursday, December 19, 2024

జామాయిల్ తోటకు నిప్పు.. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మండలం చిట్టిరామవరం గ్రామానికి చెందిన బానోత్ రాందాస్ 3 ఎకరాల జామాయిల్ తోటకు సోమవారం నిప్పు అంటుకుంది. ఈ విషయం తెలుసుకున్న రైతు రాందాస్ వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో 20 వేల ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది, రైతులు కలిసి అంచనా వేశారు. ఫైర్ సిబ్బంది త్వరగా స్పందించడంతో ఆస్తి నష్టాన్ని నివారించామని రైతు రాందాస్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లీడింగ్ ఫైర్ మెన్ సైదులు మాట్లాడుతూ.. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయాలని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అవగాహన లేకుండా అగ్నికి ఎదురుగా వెళ్లి ఇబ్బందులు పడొద్దు అని చెప్పారు. మంటలను అదుపు చేయడం కోసం మంటలు అంటుకున్న ప్రాంతానికి దూరంగా చెత్తను వేరు వేరు చేయాలని సూచించారు.

ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ తరఫున లైన్ మెన్ శ్రీను ఘటన స్థలానికి చేరుకున్నారు. వ్యవసాయ పొలాల్లో విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉండడంతో ప్రమాదం జరగకుండా లైన్ క్లియర్ చేయించారు. ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా స్పందించడంతో మంటలు అదుపు చేయగలిగామని అన్నారు. ఈ ప్రమాద నివారణ చర్యలో ఫైర్ సిబ్బంది కార్తీక్, ఎస్కే యాసిన్, అజార్, శివకృష్ణ, రైతులు మంగ్య, సొమ్లి, అచ్చమ్మ, మంజ్యా, సాల్లి, రాము, శీను, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News